ప్రొద్దుటూరు, ఆగస్టు 16: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా (ఎస్ఐఆర్) ప్రక్రియ నేపథ్యంలో మున్సిపల్, వార్డు సచివాలయ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఎస్ఐఆర్ విధుల్లో కొందరు బీఎల్ఓలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఫోన్లో అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. సెలవులో ఉన్న సిబ్బంది వెంటనే మున్సిపల్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Was this article useful?



