అన్నమయ్య జిల్లా రాయచోటి చెన్నముక్కపల్లి గ్రామంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 17 మంది కంటి రోగులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, సుండుపల్లె, వీరబల్లి, కేవీపల్లి, పీలేరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 35 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లకు అర్హులైన 17 మందిని ఎంపిక చేశారు. గతంలో ఆపరేషన్లు చేయించుకున్న మరో 35 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. రోగులు, సహాయకులకు ఎన్ఆర్ఐ దాత ఎర్రగొండ గోవర్ధన్ రెడ్డి ఆర్థిక సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వై.వి.ఆర్. స్వరూప్ గుప్తా, చెన్నూరు అన్వర్ భాష, శ్రీనివాసులు రెడ్డి, పవనిశ్ రెడ్డి, వైద్యులు సురేష్ బాబు, భార్గవి తదితరులు పాల్గొన్నారు.



