రాయచోటి: బిడ్డకు తల్లి ఎంత అవసరమో.. రాయచోటికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంతే అవసరమని టీడీపీ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో మంత్రి రాయచోటి అభివృద్ధికి, పార్టీ కార్యకర్తల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.
రాయచోటి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.300 కోట్లతో పనులు చేపట్టారని, పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు రూ.15 కోట్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాయచోటి అభివృద్ధిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో కోటకొండ రవిశంకర్, మాజీ సర్పంచ్ బసయ్య, ఏఎంసీ డైరెక్టర్ ఉదయగిరి మస్తాన్ వలి పాల్గొన్నారు.



