రాయచోటి రాజుల కాలనీ స్త్రీ శక్తి భవన్లో అనంతపురం KIMS–SAVEERA ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె, క్యాన్సర్ వ్యాధులపై నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధుల ముందస్తు గుర్తింపు, తదుపరి చికిత్సపై నిపుణులైన వైద్యులు సూచనలు అందించారు. టీడీపీ నాయకుల ప్రత్యేక కృషితో నిర్వహించిన ఈ శిబిరానికి ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు
Was this article useful?



