వేంపల్లి, ఆగస్టు 16: నీతి, నిజాయితీ, నిర్భీతి, నిరాడంబరతకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రతీకగా నిలిచారని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లిలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 106వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి లాయర్‌గా, క్రీడాకారుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించారని తెలిపారు. పదవులకే వన్నె తెచ్చిన గొప్ప ప్రజానాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు
Was this article useful?



