రాయచోటి, ఆగస్టు 11: అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను రాయచోటిలో టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, మెరుగైన శిక్షణ, క్రీడా మౌలిక వసతులు, ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ ద్వారా ప్రతిభను వెలికితీసేందుకు మంచి వేదిక ఏర్పడిందన్నారు. యువత క్రీడల్లో పాల్గొని క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి. చంద్రశేఖర్, పీడీలు కె. వీరాంజనేయులు, నర్సరాజు, సిబ్బందిని అభినందించారు.



