ప్రొద్దుటూరు: శ్రీనివాసనగర్‌లో నివాస ప్రాంతాల మధ్య నిర్మిస్తున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్. ఇర్ఫాన్ భాష ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ నివాస ప్రాంతాల మధ్య సబ్‌స్టేషన్ నిర్మాణం వల్ల విద్యుత్, అగ్ని ప్రమాదాల ముప్పు ఉందని అన్నారు. ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేపట్టడం సరికాదన్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, నివాస ప్రాంతాలకు దూరంగా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Was this article useful?



