ప్రొద్దుటూరు: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి సోమవారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 15వ వార్డులో పర్యటించారు. మైదుకూరు రోడ్డుతో పాటు ఓబయ్య కేఫ్ ప్రాంతంలో ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రభుత్వ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు, మాజీ కౌన్సిలర్ రామసంజీవరెడ్డి, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు శామీర్ భాషా, టప్పా మహబూబ్ భాషా, ఆగోలు గురప్ప, గాడి ప్రభాకర్ రెడ్డి, పోలు సురేంద్రనాథ్ రెడ్డి, జిల్లెళ్ల వెంకటేష్, కదిరి రామకృష్ణారెడ్డి, ద్వార్శల వెంకటరెడ్డి, గంగుల రంగారెడ్డి, గిద్దలూరు ఈశ్వరయ్య, మహమ్మద్ రఫీ, సీజే సుబ్బయ్య, క్రిష్ణయ్య తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



