ప్రొద్దుటూరు: కల్లూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద గొర్రెలను మేపుతున్న ఓ కాపరి ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కల్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సంఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Was this article useful?



