ప్రొద్దుటూరు: నేతన్న సేవ పథకం అమలులో అవకతవకలు జరిగాయని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి ఆరోపించారు. నరసింహాపురంలో 214 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒక్క దరఖాస్తుకూ ఆమోదం లభించలేదని తెలిపారు. పథకం అర్హులైన పేద నేతన్నలకు అందకుండా రాజకీయ జోక్యంతో కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరిందని విమర్శించారు.
మగ్గాలు లేని కొందరు టీడీపీ నాయకులకు పథకం కింద నగదు ఎలా మంజూరైందో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన ప్రతి నేతన్నకు న్యాయం చేయాలని బంగారు మునిరెడ్డి కోరారు.
Was this article useful?



