ప్రొద్దుటూరు: పురపాలక సంఘంలో సేవలందిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన వెంకటరమణ కుటుంబాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, అంత్యక్రియల ఖర్చుల కోసం నిధులు అందించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఆదేశించారు. దీంతో కమిషనర్ వెంకటరమణ నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రూ.20 వేల ఆర్థిక సాయం అందించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ నూర్ భాషా, యూనియన్ నాయకులు చంటి, రాఘవేంద్ర, రవికుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



