పులివెందుల: పట్టణంలోని పార్నపల్లి బస్టాండ్ నుంచి నగిరిగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో వివేకానంద స్కూల్ సమీపంలో మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. సుమారు నెల రోజులుగా మ్యాన్‌హోల్ పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదని స్థానికులు వాపోతున్నారు.
తాజాగా మ్యాన్‌హోల్ పూర్తిగా దెబ్బతినడంతో రహదారిపై ప్రమాదకర పరిస్థితి నెలకొంది. నిత్యం వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.



