కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ నరసింహులు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్, క్రిస్టియన్ కాలనీ, కడప రోడ్డు, రెడ్డయ్య కాలనీ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు ఈ నిఘా చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Was this article useful?



