రాయచోటి: ప్రజల్లో ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్నారని రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలు రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్ హామీలు అమలు కాలేదన్నారు. ప్రస్తుతం నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుంటే ఓర్వలేక ధర్నాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
Was this article useful?



