జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో అమలైన ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా రాయచోటి నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు సుమారు 400 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందారని తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి ఐదేళ్లలో రూ.1.20 లక్షల ఆర్థిక సహాయం అందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవ’ పథకం కేవలం 190 మందికే పరిమితమైందని విమర్శించారు. అర్హులైన అనేక మంది పథకానికి దూరమయ్యారని అన్నారు. చేనేత కార్మికులకు బకాయిగా ఉన్న రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేసి, అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగం దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, ప్రతి చేనేత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.



