చిన్నమండెం, ఆగస్టు 7: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లి నుంచి చిన్నమండెం వెళ్లే మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి టీడీపీ నాయకుడు మౌర్య రెడ్డి మానవత్వంతో అండగా నిలిచారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గమనించిన మౌర్య రెడ్డి వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం వైద్యులతో స్వయంగా మాట్లాడి బాధితుడికి సకాలంలో మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించిన మౌర్య రెడ్డి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
Was this article useful?



