సింహాద్రిపురం, ఆగస్టు 7: సింహాద్రిపురం మండల కేంద్రంలోని కోవరంగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9వ తేదీ (ఆదివారం) సావిత్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయనున్నారు. శస్త్రచికిత్స అవసరమైన రోగులకు ఉచిత ఆపరేషన్‌తో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
Was this article useful?



