వేంపల్లె, ఆగస్టు 7: స్థానిక శ్లోక ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక అధికారి బి. శివరామిరెడ్డి విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాథమిక రక్షణ చర్యలను డెమో ద్వారా వివరించారు. ప్రమాద సమయంలో భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి. నవనీశ్వర రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది హరిబాబు, సురేంద్రరెడ్డి, భీమాంజనేయులు, సంజీవరెడ్డి, ఆసిఫ్, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించిన వెంటనే 101 టోల్‌ఫ్రీ లేదా వేంపల్లె అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని అధికారులు సూచించారు



