పులివెందుల, ఆగస్టు 7: కడప జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందులలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మురళి నాయక్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ సీఐ జి. ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పూలంగళ్ల సర్కిల్లో వాహనాలను తనిఖీ చేసి, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, వాహన పత్రాలు లేకపోవడం తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.
Was this article useful?



