పులివెందుల: పట్టణంలోని 1వ వార్డు కొండారెడ్డి కాలనీలో నెలకొన్న మురికినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు పురపాలక అధికారులను కోరారు. ఈ సమస్యపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కాలనీలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని వారు పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డి.వై.పీ. ప్రసాద్, గ్యారంటీ బాబావలి తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



