న్యూఢిల్లీ, జూలై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి న్యూఢిల్లీలో ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధి, దివ్యాంగ క్రీడాకారులకు మెరుగైన శిక్షణా సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
మంత్రి మాట్లాడుతూ, నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. యువతతో పాటు దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారికి అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు, ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ లక్ష్యాల సాధనలో కేంద్ర సంస్థల సహకారం కీలకమని పేర్కొన్నారు.
అదేవిధంగా రాయచోటి నియోజకవర్గంలో పారా స్పోర్ట్స్ శిక్షణా కేంద్రం లేదా ప్రత్యేక క్రీడా మౌలిక వసతుల ఏర్పాటును పరిశీలించాలని దేవేంద్ర ఝఝారియాను మంత్రి కోరారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన దివ్యాంగ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యే అవకాశం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఇరువురు అభిప్రాయపడినట్లు వెల్లడించారు.



