కాణిపాకం, జూలై 27: ప్రముఖ సినీ నటుడు సుమన్ సోమవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శివప్రసాద్, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, స్థానిక నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.



