అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గోపిగుడిపల్లి, గువ్వలచెరువు గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ బూత్ నంబర్ 39, గువ్వలచెరువు బూత్ నంబర్ 35 పరిధిలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో రామాపురం మండల టీడీపీ అధ్యక్షులు గాలివీటి సురేంద్ర రెడ్డి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ పప్పిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.



