Breaking

మిస్సైల్ మ్యాన్ కలాంకు ఘన నివాళి

ప్రొద్దుటూరు, జూలై 27: భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా హోమ్స్‌పేటలోని స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజా సోమశేఖర రెడ్డి కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలాం సాధారణ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారని, “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, ఉప ప్రధాన కార్యదర్శి గరుడాచలం, కోశాధికారి పుల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొని కలాంకు ఘన నివాళులర్పించారు.

Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.