Breaking

మాజీ రాష్ట్రపతి కలాంకు ఘన నివాళులు

ప్రొద్దుటూరు, జూలై 27: భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీరాములపేట ఉపాధ్యాయ సేవా కేంద్రంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కలాం నిరాడంబర జీవితం, దేశభక్తి, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కలాంకు ఘన నివాళులర్పించారు.

Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.