వైయస్సార్ కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేటలో సుసాన్ రాణి (40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు మూడు రోజుల క్రితమే ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా తలపై బలమైన గాయం ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలంగా ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



