మదనపల్లి, జూలై 6: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామీణ సున్నిత ప్రాంతాలను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి నేరాలను అరికట్టడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



