* డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
రాయచోటి, జూలై 27: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని టీడీపీ రాష్ట్ర నాయకులు, రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డోర్-టు-డోర్ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, గ్రామ అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



