మదనపల్లి, జూలై 27.(కలం మనస్సాక్షి ప్రతినిధి) : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి 83 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 52 భూవివాదాలు ఉండగా, ఆర్థిక, కుటుంబ వివాదాలు, మోసాలు, న్యూసెన్స్, ఎఫ్ఐఆర్కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణ విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.



