ప్రొద్దుటూరు :
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం పంచాయతీ భగత్‌సింగ్ కాలనీలో సోమవారం నిర్వహించిన “ఇంటింటికీ ఎమ్మెల్యే” కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కొండవీటి భావనాతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, సామాజిక పింఛన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన వారికి అందుతోందా అనే విషయంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకుంటూ, ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు బచ్చల ప్రతాప్, బీజేపీ నాయకుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, జనసేన నాయకుడు శివకుమార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.



