చిన్నమండెం : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని బోర్రెడ్డిగారిపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజలిచ్చే రెవెన్యూ సమస్యలకు తొందరగా పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించారు. పలు అభివృద్ధి పనులపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 4