లక్కిరెడ్డిపల్లె : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పర్యటన సందర్భంగా వడ్డేపల్లి గ్రామానికి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఆర్.లక్ష్మయ్య తన కాలుకు గాయం ఏర్పడడంతో వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందజేయాలని మంత్రివర్యులను కోరారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి అప్పటికప్పుడే ఆయన వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందజేసి లక్ష్మయ్య కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ చేసి తెలిపారు.
Post Views: 11