పుంగనూరు సైకిల్ యాత్రికులకు ఇర్షాద్ సంఘీభావం

రాయచోటి : మే 27 28 29 తేదీలలో కడపలో జరగనున్న భారీ మహానాడు కు పుంగనూరు నుండి 8 మంది కడపకు సైకిల్ యాత్రగా తరలి వెళ్లారు. మార్గమధ్యమంలో రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర రాయచోటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అఫ్కాన్ ఇర్షాద్ వారిని కలిసి యాత్రకు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో రాయచోటి నియోజకవర్గం నుండి ప్రజలు వెళ్లేందుకు భారీగా వాహన సౌకర్యాలు కల్పిస్తూ, రామాపురం గువ్వలచెరువు మార్గమధ్యమంలో లక్ష మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి నిర్వహిస్తున్నారు అన్నారు. తెలుగు బ్రతికున్నంత వరకు తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎవరు మరచిపోలేని రీతిలో మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇప్పటివరకు జరిగిన మహానాడుల సభల కంటే కడపలో జరిగే మహానాడు సభను అత్యంత భారీగా సుందరీకరిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై మహానాడు ను దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Facebook
X
LinkedIn
WhatsApp