చమర్తిని సన్మానించిన ఒంటిమిట్ట తెలుగు తమ్ముళ్లు

రాజంపేట, మర్చి 23 : రాజంపేట టిడిపి పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజును ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి ,గంగ పేరూరుకు చెందిన తెలుగు తమ్ముళ్లు దుశాలవా కప్పి పూల బొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరగా దానికి చమర్తి సానుకూలంగా ప్రతి గ్రామాన్ని ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ, కట్ట విశ్వనాథ, కట్ట మల్లికార్జున, కట్ట రాజేష్, శేఖర్, ప్రతాప్, మనోహర్, సన్నీ, బాలకృష్ణయ్య, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp