కడప శిల్పారామం, మార్చి 23 : కడప పట్టణంలోని శిల్పారామంలో ఆదివారం సాయంత్రం GRT GVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుక కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం నరసింహలు శంకర్, రజనిల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు. యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, శ్రీనివాసులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడప పట్టణంలో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉన్నతమైన అవకాశలను వదులుకొని ఇక్కడ GRTGVK స్కూల్ స్థాపించి మంచి విద్యను అందిస్తున్న యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తమ లక్ష్యసాధన కోసం పట్టుదల క్రమశిక్షణతో చదవాలని విద్యార్థులకు సూచించారు. ప్రసాద్ బాబుని స్కూల్ యాజమాన్యం శంకర్, రజనిలు శాలువాతో ఘనంగా సన్మానించారు.
GRT GVK వార్షికోత్సవ వేడుకల్లో ప్రసాద్ బాబు


Post Views: 15
Facebook
X
LinkedIn
WhatsApp

