లయలతుల్ ఖద్ర్ ని భక్తి శ్రద్దలతో నిర్వహించుకుందాం

రాయచోటి, మార్చి 27 : పవిత్ర రంజాన్ 27వ రాత్రి “లయలతుల్ ఖదర్ రాత్రి” భక్తి, గౌరవం, సద్గుణాల పెంపు, మంచిపనులు మరియు శాంతిమయ జీవితాన్ని కోరుకునే రాత్రి. ఈ రాత్రిని విలువైనదిగా భావించి మంచి ముగింపు (ఖాతిమా బిల్ ఖైర్) కోసం ప్రార్థించాలని రాయచోటి పట్టణ సర్ ఖాజీ సయ్యద్ షరఫ్ ఉద్దీన్ హసనీ సాహెబ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అల్లాహ్ యొక్క కృప, ఆశీర్వాదం మనందరికీ లభించాలని, ఈ పవిత్రమైన రాత్రిని శాంతి, దైవభక్తికి ఉపయోగించుకుని ఐక్యత కోసం ప్రార్థిద్దాం అన్నారు. ఆరోగ్యకరమైన, విజయవంతమైన జీవితం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించండి. పెద్దల మాటలను పాటించాలని, హద్దులు దాటితే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనవసరమైన సమస్యలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. శాంతికి నిలయంగా రాయచోటిని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp