జిల్లాలో ప్రత్యేక అధికారి వినయ్ చంద్ పర్యటన

రాయచోటి, మార్చి 14 : రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్, ఐఏఎస్ అన్నమయ్య జిల్లాలో శనివారం పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్, ఐఏఎస్ శనివారం ఉదయం 9 గంటల నుండి పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. రాయచోటిలోని డైట్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కాటిమాయకుంట, తదితర ప్రాంతాలలో జరగనున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp