2024 ఎన్నికల హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చిన విషయం విధితమే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలిలో తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామన్నారు. కర్ణాటక, తెలంగాణ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉన్న విషయం తెలిసిందే.
Post Views: 13