చిన్నగొట్టిగల్లులో భూవివాదం… కంచె ధ్వంసం

చిన్నగొట్టిగల్లు మండలం, దీందారులపల్లె పంచాయతీ పరిధిలోని చిట్టిచర్ల గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడు సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం, 2017లో కొనుగోలు చేసిన 1.25 ఎకరాల పట్టా భూమి (సర్వే నం.1696-2) చుట్టూ వేసుకున్న రాతి కూసాలు, పైపులను కొందరు జెసిబితో తొలగించారు. కొక్కంటి శంకర్ తదితరులు గుంపుగా వచ్చి కంచె ధ్వంసం చేసి, తనపైనే తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp