పౌష్టికాహారంతోనే పిల్లల పెరుగుదల–పోషణ పక్వాడా నిర్వహణ

కె.వి పల్లి మండలం, గుండ్రేవారిపల్లి, పీకేఆర్‌పల్లి నూతనకాల్వ సబ్‌సెంటర్‌లో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శంకరమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్‌ఎంలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల సరైన పెరుగుదల, మెదడు అభివృద్ధికి పౌష్టికాహారం అవసరమని వివరించారు. ఇంటి వద్ద తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని గర్భిణీలకు చూపించి అవగాహన కల్పించారు.

Facebook
X
LinkedIn
WhatsApp