ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

పీలేరు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల ధరణ్ కుమార్, నడిమికండ్రిగ సుధాకర్ బాబు మాట్లాడుతూ కులవ్యవస్థ నిర్మూలన, మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో శ్రీరాములు, ధనాసి వెంకటరామయ్య, బుక్కే హరినాయక్, జెట్టి మల్లికార్జున, శ్రీకాంత్, అశోక్, గంగాధరం, శ్రీనివాసులు, తిమ్మామయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp