చేతన్ రాయల్ జన్మదిన వేడుకలో ప్రసాద్ బాబు

రాయచోటి |
రాయచోటిలోని ప్రీతం ఫంక్షన్ హాల్‌లో వేలూరు వెంకటేశులు కీర్తన దంపతుల కుమారుడు వేలూరు వెంకట చేతన్ రాయల్ 2వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిన్నారి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య ఆనందోత్సాహాల నడుమ సాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నారితో కేక్ కట్ చేయించి, స్వయంగా తినిపిస్తూ ముద్దుగా ఆశీస్సులు అందజేశారు. చేతన్ రాయల్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు సంతోషకర వాతావరణంలో ముగిశాయి.

Facebook
X
LinkedIn
WhatsApp