రాయచోటి:
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో పురపాలక కమిషనర్ రమణా రెడ్డి “వాక్ విత్” కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. తాగునీటి కొరత, సిమెంట్ రోడ్లు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, చెత్త సేకరణలో లోపాలు, వీధిలైట్ల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై స్పందించిన కమిషనర్ వెంటనే కొన్ని సమస్యలను పరిష్కరించగా, మిగతావాటిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీరు రెండు రోజులకు ఒకసారి అందేలా చూడాలని, డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేయొద్దని పారిశుధ్య సిబ్బందిని హెచ్చరించారు.
Post Views: 1