తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు, మార్చి 26:రాష్ట్రంలో వైఎస్సార్సీపీ వైపు యువత అత్యధికంగా ఆకర్షితులవుతున్నారని రాష్ట్ర కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ అవకాశాలపై వైసీపీ నాయకత్వంపై యువతలో విశ్వాసం పెరుగుతుండటం వల్లే ఈ మార్పు చోటు చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని రంగనాయకులపేటలో రామిరెడ్డి ధ్వజారెడ్డి, గొట్టం లక్ష్మీపతి, కొన్నిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువత పార్టీలో చేరారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, మండలంలో జరుగుతున్న విస్తృత సేవా కార్యక్రమాలు తమను ఆకర్షించాయని తెలిపారు. ఇకపై ధ్వజారెడ్డి తో కలిసి ముందుకు సాగుతూ, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా రామిరెడ్డి ధ్వజారెడ్డి యువతకు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో , గాలిశెట్టి నాగేంద్ర, గోవింద్ సాయి, గోవింద్ తేజ, హేమంత్, కోలా నాని, గడ్డం మణి, అశోక్, జగన్, మల్లి, రఫీ,చిన్న, బాలాజీ, శివ,రవి కుమార్,దినేష్,రాజేష్, యానాదయ్య, సురేష్, చందు, రమణ, శివ కుమార్, నరసింహ, రసూల్, శ్రావణ్, సాయి, మల్లి కుమార్,ధనా, సత్య, శశి, ధర్మ, గురు, బాలాజీ, జగన్ కుమార్, సబ్బీర్, నితేష్, సతీష్, సిద్ధు రాఘవ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ లోకి భారీగా చేరుతున్న యువత.. రామిరెడ్డి ధ్వజా రెడ్డి
Post Views: 2
Facebook
X
LinkedIn
WhatsApp