తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చ్ 21 మనస్సాక్షి: ముస్లిం సోదర సోదరీమణులు నెల రోజులపాటు ఉపవాస దీక్షలు ముగించుకొని శనివారం (21) నాడు ఈద్- ఉల్- ఫితర్ (పవిత్ర రంజాన్) పర్వదిన పండుగ పురస్కరించుకొని, పట్టణ పరిధిలోని మైసూరు వారి పల్లి గ్రామపంచాయతీ లోని ఈద్గాహ్ వద్ద సుమారు 3000 మందికి పైగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రంజాన్ ప్రార్థనలో పలువురు రాజకీయ నాయకులు, హిందూ సోదరులు స్నేహపూర్వక వాతావరణంలో ప్రార్థనలలో పాల్గొని అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లాహ్ ఆశీస్సులతో అందరి జీవితాలలో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యలతో విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
Post Views: 4