తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 20 మనస్సాక్షి : ఓబులువారిపల్లి మండలం, ముక్కావారిపల్లి పంచాయతీ పరిధిలో కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు సంతోషం వ్యక్తపరుస్తూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ముక్క సాయి వికాస్ రెడ్డి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియ పరిచారు ల్గొన్నారు ప్రముఖ నాయకులు పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు . ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉగాది సందర్భంగా 10,000 కు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం యువత భవిష్యత్తుకు ముందడుగుగా వారు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు మంత్రి నారా లోకేష్‌ను ఈ సందర్బంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాబ్ క్యాలెండర్ విడుదలపై హర్షాతిరేకాలు – పాలాభిషేకం.
Post Views: 4
Facebook
X
LinkedIn
WhatsApp