వైసిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ “రామిరెడ్డి ధ్వజా రెడ్డి” కి ఘన సన్మానం.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 20 మనస్సాక్షి : రైల్వే కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ని, మాజీ ముఖ్యమంత్రి వైయస్ మోహన్ రెడ్డి వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో,  రామిరెడ్డి ద్వజారెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేసిన నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు. ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియపరిచారు.సంతోషం వెలిబిచ్చారు, భవిష్యత్తులో రామిరెడ్డి ద్వజారెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అందుకొని కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, పార్టీ అభవృద్ధికి తొడ్పాటునను అందిస్తూ ప్రజాసేవలో ఆయన ముందుండాలని వారు ఆకాంక్షించారు. ధ్వజారెడ్డిని సన్మానించిన వారిలో వైసీపీ సీనియర్ యాదవ సంఘం నాయకులు బత్తిన ఆనంద యాదవ్, మాజీ వైస్ సర్పంచ్ కౌలూరి సిద్దయ్య, బత్తల సుబ్రహ్మణ్యం(మణి ), ఎంపీటీసీ నూక మహేష్ రెడ్డి, సర్పంచ్ లు హరికృష్ణ రెడ్డి, దార్ల చంద్రశేఖర్, గోపి, డివి రమణ. కంచర్ల వెంకటరమణారెడ్డి, గౌతంరెడ్డి ఇతర నాయకులు ధ్వజారెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన వారిలో ఉన్నారు

Facebook
X
LinkedIn
WhatsApp