తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు, మార్చి 16 (మనస్సాక్షి): అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి టీడీపీ యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు ఎంపీడీఓ కార్యాలయం మరియు ధార్మిక కార్యాచరణ ప్రణాళిక యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఆయన చూపిన త్యాగం, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్, ఏపి ఎం వసుందర దేవి, ఇతర మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.