తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 15 మనస్సాక్షి: :ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ తమ సొంత నిధులు వెచ్చించి నిర్మించిన నూతన బస్ షెల్టర్‌ను ముక్కా రూపానంద రెడ్డి, అయన సతీమణి ముక్క వరలక్ష్మి వారి కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముక్క సాయి వికాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానంద రెడ్డి కి వారి కుటుంబ సభ్యులకు టిడిపి సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసులు రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు పేద ప్రజలకు కష్టాలలో అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని, పేద ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ముక్కా ఫౌండేషన్ అన్నారు,పేదలకు అండగా నిలుస్తూ కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పి, గడప తొక్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తక్షణమే ఆర్థిక సహాయం అందిస్తూ, నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి ఆపరేషన్లకు సొంత నిధులు వెచ్చిస్తూ సేవే పరమావధిగా ముందుకు వెళుతూ నేడు సొంత నిధులతో ముక్క వారి పల్లెలో బస్స్టాండ్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చరిత్రలో నిలిచిపోయే అంశమని, ముక్క కుటుంబం తలపెడుతున్న పలు సేవా కార్యక్రమాలను ప్రజలు చిరకాలం తమ మనసులో దాచుకుంటారని ఈ సందర్భంగా ముక్క ఫౌండేషన్ ను ప్రతి ఒక్కరు అభినందించడం రూపానంద రెడ్డి కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని పాటూరు శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్బంగా తెలియజేశారు.
ముక్కా రూపనంద రెడ్డి సేవలు చిరస్మరణీయం: టీడీపీ నాయకులు పాటూరు శ్రీనివాసుల రెడ్డి
Post Views: 3
Facebook
X
LinkedIn
WhatsApp