రైల్వే కోడూరు, మార్చి 15 మనస్సాక్షి : 10 వ తరగతి చదువుతూ రేపు పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల కొరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో టాలెంట్ టెస్ట్ పరీక్షను నిర్వహించారు.ఈ పరీక్షకు సుమారు 500 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లతీఫ్ మాట్లాడుతూ, పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి పాఠశాలకు మూడు స్థానాలుగా బహుమతులు అందజేశామని తెలిపారు.
“చదువు – పోరాడు” అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా చదువులో కూడా ముందుండాలని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.
అదేవిధంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచనలు ఇచ్చారు. అన్ని విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గోవర్ధన్, విజయ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.